haaram logo

Friday, September 18, 2009

'వాణిశ్రీ-వీణా నాదం '

వాణిశ్రీ అంటేనే వీణ. నవరసాలను వీణలోనే పలికించింది. తానే 'వీణా వాణి ' అని నిరూపించింది. ఒకప్పుడు సినిమాల్లో పియానొ ఎక్కువ వాడే వాళ్ళు. కాని వాణిశ్రీ తోటి వీణా యుగం ప్రారంభమైంది. అంతకు ముందు ఒకటి అర వీణ పాటలు ఉన్నా వాణిశ్రీ తోటే వీణ కి ఎక్కువ గుర్తింపు వొచ్హింది. వాణిశ్రీ ఉంటే తప్పకుండా వీణ పాట ఉండాల్సిందే. వాణిశ్రీ వీణ పాటలు చూసి ఎందరో వీణ నేర్చుకోటం మొదలు పెట్టారు. పెళ్ళి చూపుల్లో వీణ వాయించటం ఒక ఫాషన్ అయిపోయింది.

'వీణ లోనా తీగ లోన, ఎక్కడున్నది నాదము, అది ఎలాగైనది రాగము, మాటలోన- మనసులోన, ఎక్కడున్నది భావము, అది ఎప్పుడౌను గానము ' అని 'చక్రవాకమై ' అబ్బుర పడింది.

'మదిలో వీణలు మ్రోగే, ఆశలెన్నొ చెలరేగే, కలనైన కనని ఆనందం , ఇలలోన విరిసె ఈనాడే! ' అని ఎంతో ఆత్మీయంగా, తనకు తెలియకుండా చాటుగా దాగి ఉన్న ప్రియుడికి తన వీణా గానం తోనే మనసు విప్పి చెప్పగలిగింది.

అంతే కాదు- ' ఈ వీణ పలికించు ఎన్ని రాగాలో, నాలోన మ్రోగేను ఎన్ని భావాలో,' అంటూ అత్తలు-కోడళ్ళు లో పొలం పనులనుంచి వొచ్హిన భర్తని, అతి సున్నితంగా వీణ మీటి సేదతీర్చింది. ఆ వీణా నాదంలోని ప్రేమకి పరవశించి సోలిపోని వారు ఎవరు?

'ఏ రాగమని పాడను, ఏ తీగ నే మీటను- నవరస, కన్నడ, వసంత, వరాళి, మోహన, కల్యాణి, ఆనంద భైరవి ' అంటూ అన్ని రాగాల ప్రేమనుబంధంతో 'జీవన తీరాలు ' దాటగలిగే శక్తి ఈ వీణదే అని చెప్పకనే చెప్పింది.

నిశ్శబ్ధంగా ఉండిపోయిన మనసును- ' మీటి చూడు నీ హ్రుదయాన్ని, మ్రోగుతుంది ఒక రాగం-,అంటు జీవితంలోని 'చీకటి వెలుగులను ' తట్టుకో గలిగే ఉత్సాహాన్ని ఈ వీణ తోటే కలిగిస్తుంది.

ఎంతో ప్రేమని పంచిన తన ప్రేమికుడు, ' దేశోద్ధారకుడు' గా సంఘసేవ లందిచాలని భావించిన ఉన్నతుడు తనకు దూరమైతే - 'ఈ వీణకు శ్రుతి లేదు, ఎందరికో హ్రుదయం లేదు, ఈ పాటకు పల్లవి లేదు, ఈ బ్రతుకెందులకో అర్ధం కాదు' అని తన నిరాశా నిష్ప్రుహలను కూడా ఈ వీణ లోనే పలికించింది.

' నీ దయరాదా, రామ నీ దయ రాదా,- అని ఎంతో భక్తిగా తన వీణా నాదంతోనే 'పూజ ' లు చేసి దేవుణ్ణి కూడా కరిగించటానికి ప్రయత్నం చేసింది.

'ఎవరో రావాలి, ఈ వీణను కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి,' అని చివరికి ఎంతో ఆర్ధ్రం గా మూల దాగి మూగ బోయిన మధుర వీణని కూడ ఓదార్చి 'రక్తి మరచి-శక్తి విడచి, మాసిపో తగునా!' అని నిలదీసి ఒక 'ప్రేమ నగరాన్ని ' నిర్మించే శక్తి ఒక్క వాణిశ్రీ కే ఉందేమో, అనిపిస్తుంది.

వాణిశ్రీ లో సావిత్రిని చూసుకున్నాము. వాణిశ్రీ ని ఎవరిలో చూసుకోవాలో!

14 comments:

  1. చక్కని టపా.. మొన్నామధ్య 'ప్రేమనగర్' చూస్తూ అనుకున్నా.. వాణిశ్రీ వీణ పాటల గురించి రాస్తే ఎలా ఉంటుంది? అని.. ఈ సందర్భంగా వాణిశ్రీ పేరు 'వీణశ్రీ' గా మారుమోగిపోతున్న రోజుల్లో ఒక సినిమా పత్రిక లో వచ్చిన కార్టూన్ జోకు: ఇంటి బయట 'వీణశ్రీ, సిని నటి' అని బోర్డు ఉంటుంది.. లోపల ఒకమ్మాయి పెద్ద కొప్పేసుకుని (ఈ కొప్పుల మీద కూడా ఓ టపా రాయొచ్చు) వీణ వాయించుకుంటూ ఉంటుంది, 'ఎవరో రావాలీ..' అని పాడుకుంటూ.. ఆమె తండ్రి ఓ కుర్రాడిని తీసుకొచ్చి చెబుతాడు "ఇదిగో అమ్మాయ్! నీ బాధ చూడలేక వీణలు బాగుచేసే కుర్రాడిని తీసుకొచ్చాను.. అతను బాగు చేస్తాడులే.."

    ReplyDelete
  2. థాంక్ గాడ్! మీకంటే ముందే నేను 'వీణశ్రీ ' పాటలు రాశేసానోచ్. కాకపోతే మీరు రాసి ఉంటే ఇంకా బాగుండేదేమొ. మీరన్నట్లు 'కొప్పులకు ' పెద్ద కథే ఉంది. వాణిశ్రీ కొప్పులకు కూడా ప్రసిద్దే. తన ఇంటర్వ్యూ లోనే ఒకసారి ఎక్కడో చదివాను. హీరో (పేరు గుర్తు లేదు) తనను ఎత్తుకొని వెళ్తూ ఉండగా ఇంతలోనే జారి కింద పడిపోయిందట. తన కొప్పు వల్లనే తన తలకి దెబ్బ తగల కుండా బతికి బయట పడ్డానని, లేకపోతే చాల పెద్ద ప్రమాదం జరిగిఉండేదని చెప్పింది.

    ReplyDelete
  3. బాగుంది వాణిశ్రీ వీణశ్రీ కథ.. బహుశా ఆ హీరో నాగేశ్వర రావు గారు ఏమో, ఆయన ఏం అత్తుకోగలరు చెప్పండి (కిచ కిచ ) :-)
    జయసుధ ను వాణిశ్రీ వారసురాలంటారు కదా

    ReplyDelete
  4. భావన గారికి ధన్యవాదాలు. ఏమోనండి, జయసుధ వారసురాలు అన్న విషయం ఎందుకో నాకు పూర్తిగా ఒప్పుకో బుద్ధి కాదు. అలాగే సౌందర్య పేరు కూడా చెబుతారు.
    ఇంకా నయం మీరు వాణిశ్రీ, వీణశ్రీ కి ఓణిశ్రీ అని కలిపేస్తారనుకున్నాను.
    మీరు చాలా కాజుయల్ గా రాసేస్తు ఉంటారండి. మీ బ్లోగ్ 'పరిమళం ' చాలా బాగుంటుంది.

    ReplyDelete
  5. డబుల్ శబాష్! నాకు చాలా కాలంగా తెలుగు సినిమాల్లో వీణ పాటల్ని తల్చుకుంటూ ఒక టపా రాయాలనుండేది.
    చాలా బాగా రాశారు.

    వాణిశ్రీకి ముందటి కొన్ని వీణ పాటలు - పాడమని నన్నడగ వలెనా, ఏమని పాడెదనో ఈ వేళ, సఖియా వివరించవే. డా. చక్రవర్తిలో మనసున మనసై లో సావిత్రి సితార్ వాయిస్తుంది. తమాషాగా చాలా చారిత్రక, జానపద, పౌరాణిక సినిమాల్లో రామారావు వీణ వాయించడం చూస్తాం.

    ReplyDelete
  6. కొత్తపాళీ గారు, మీరు నిజంగానే 'డబుల్ శభాష్ ' అన్నారా! ఈ సారి ఇంకా మంచిగా రాయడానికి ప్రయత్నం చేస్తాను. మీ వ్యాఖ్య కోసం ఎప్పుడూ నాకు తెలియ కుండానే ఎదురుచూస్తూ ఉంటాను. కాకపోతే, మేము నిద్రపోయాక రహస్యంగా వొచ్హిపోతారు.

    ReplyDelete
  7. వీణపాటలు వినడానికి ఓకే. కాని కొన్ని సినిమాల్లో వీణపాటలు చూస్తే చిరాకేస్తుంది. ఒక సినిమా పేరు గుర్తులేదు. చావుకు దగ్గరైన వాణిశ్రీ హై పిచ్ లో పాడేస్తూ ఉంటుంది. వీణపై ఆవేశంగా వేళ్లు పైకి కిందకి లాగేస్తూ. ( తర్వాత హీరో వచ్చాక బ్రతుకుతుంది . అది వేరే సంగతి అనుకోండ్ ).అసలు వీణను ఒక అలంకారంగా పెడతారే తప్ప అసలు అది పాటకు తగ్గట్టుగా వాయించినట్టు ఉంటుందా అని.. వాణిశ్రీ కొప్పులు, చీరకట్టు, నెక్లెస్ సెట్టుల సంగతి చెప్పాలా? ఫ్యాన్సీ దుకాణాల వాళ్లని పరుగులెత్తించింది. అలాగే ఆడవాళ్లను..

    ReplyDelete
  8. జ్యొతి గారు, ముందుగా మీకు స్వాగతం. నిజమే, సినిమాలు అంటేనే అలా ఉంటై. అందరి గొంతులు మామూలుగా ఉండవ్. ఈ రకం సీన్లు అన్ని సిన్మాల్లోను మామూలై పోయింది. ఏమి పసలేకుండా సినిమాలు చూడలేముగా! ప్రేక్షకులు కరిగి నీరై పోవాలంటే, అంతేమరి

    ReplyDelete
  9. chaalaa baagaa raasaavu. induloe chaalaa pictures nenu chudaledu .paatalu maatramu vinnaanu.
    jayasudhani vaanisri vaarasuraalugaa nenu anukonu .soundarya konchamu ok.
    asalu savitri vaarasuraaligaa naakevaruu anipincharu !
    bhavana gaari blog krishnapaksham
    parimalam kaadu

    ReplyDelete
  10. బాగుంది పోస్ట్.ఈ విషయమ్ మీద చాలా రాయాలని ఉంది కానీ...ఇప్పుడు ఆలస్యమైపోయింది..!మీ పాటల టపాల్లో వ్యాఖ్య రాద్దాం అంటే కుదరట్లేదు ఎంచేతండీ?

    ReplyDelete
  11. మలా గారికి@ థాంక్యు వెరీమచ్. భావన గారి బ్లోగ్ పేరు పరిమళం అనలేదు. బ్లోగ్ యొక్క పరిమళం చాలా బాగుంటుంది అని అర్ధం. 'పరిమళం ' అన్న పేరు ఉపయోగించచ్హు కదా!
    త్రుష్ణ గారికి@ ధన్యవాదాలు. దీనికి ఆలష్యం అయిందంటు ఏమి లేదండి. మీరు ఇంకా చాలా బాగ రాయొచ్హు. నా పాటల బ్లోగ్ లో టేంప్లేట్ కోసం ప్రయోగాలు చేసాను. అది పూర్తిగా డిస్టర్బ్ అయిపోయినట్లుంది.

    ReplyDelete
  12. అర్రే మాలా గారు మంచి చాన్స్ మిస్స్ చేసేసేరు నేను కాసేపు పరిమళం గారికి ఫోజ్ కొడదామనుకున్ననే ఆమెను కంఫ్యూజ్ చేసి చూడండి జయ గారు నా సైట్ మెచ్చుకున్నారు అని. అయ్యో. :-)

    ReplyDelete
  13. Jaya,
    Thanks for Veena album,you for got to say,before Vanisree it was Late Mrs Avitri,in Dr Chakraverty, infact Vaniji snatched it from her, once in way though she allowed Mrs Chandrakala to "Handel" it but it was Vani"s instrument and she justified it,thanks for veena memories.

    ReplyDelete