
ఆయా సందర్భాలలో ఈ పాటలు పాడితే ఎలాఉంటుందో!
పుట్టినరోజు పార్టీలొ: వేణువై వొచ్హాను భువనానికి, గాలినై పోతాను గగనానికి
పెళ్ళిరోజు: పావురానికి, పంజరానికి పెళ్ళి చేసె పాడులోకం--
చావుకి : భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటిరోజు.
గ్రుహ ప్రవేశానికి : దేవుడే ఇచ్హాడు వీధి ఒకటి, సొంత ఇల్లేల, ఉన్నఊరేల ఓ చెల్లెలా!
పిక్నిక్ లో: అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మ త్రుప్తికై మనుషులు ఆడుకునే నాటకం, వింత నాటకం.
బ్యూటీ పార్లల్ లో: పాడు జీవితము యవ్వనం , మూడునాళ్ళ ముచ్హట లోయి, అయ్యయ్యో! నీదు పరుగులెచటికోయి.
ప్రేమికుల దగ్గిర: మనసు గతి ఇంతే! మనిషి బ్రతుకింతే! మనసున్న మనిషికీ సుఖము లేదంతే!
తీర్థ యాత్రలకు వెల్తుంటే: టాటా! వీడుకోలు! గుడ్బై ఇంక శెలవు--
ఓకే! ఇంక నాకు కూడ శెలవు.
మీరు కూడా ఏమైనా జోడిస్తారేమొ చూడండి!
(ఇది కేవలం సరదాకు మాత్రమే)
ha...ha..:)
ReplyDeleteఅలా నవ్వే బదులు మీరు కూడ ఒకటి ఒదలొచ్హు కదా!
ReplyDeleteపన్లోపని- మీరు రాసే చక్కటి కవితలు, ఆ బొమ్మలు నాకు చాలా నచ్హుతాయి.
చాలా funnyగా ఉన్నాయండి.. బాగా రాశారు :) .. నేను కూడా ప్రయత్నించా..
ReplyDeleteశ్రీమంతం(పేరంటం): అత్త లేని కోడలుత్తమురాలు ఒయమ్మా! కోడల్లేని అత్త సుఖవంతురాలు! ఆహ..ఆహ
school annual day: దేవుడ..దేవుడ.. అమ్మా నాన్న లేని వాళ్లం.. దేవుడ దేవుడ.. గూడు గుడిస లేని వాళ్లం..
freshers' day: నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే కథ నేనే..
ప్రేమికుల రోజు: మాయేరా..మాయేరా.. ప్రేమ అన్నది మాయేలేర..ఊరించే ఊహాలోకం లేరా
చావు రోజు: గాల్లో తేలినట్టుందే.. గుండె పేలినట్టుందే..తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
రవితేజ గారు, మీ ప్రయోగాలు కూడా గమ్మత్తుగ ఉన్నాయి. నా బ్లొగ్ కి వొచ్హినందుకు ధన్యవాదాలండి
ReplyDeleteహి హి హి
ReplyDeleteఅంతె .ఇంకెప్పుడన్నా గుర్తుకు వస్తే రాస్తాను.
హ హ హ.
ReplyDeleteభలే.
నాకెప్పుడూ అర్ధం కాదు, మన పాత సినిమాల్లో హీరోయిను పెళ్ళి ఇంకెవరో గొట్టంగాడితో జరుగుతోంటే ఆ సందర్భంగా హీరోని పాట పాడమంటే ఆ హీరోగారు ఏడవలేక నవ్వుతూ భగ్నమైన నా హృదయం అంటూ పాడుతుంటారు.
మీటపాలు, నీలి నేపథ్యమ్మీద నీలి అక్షరాలు చదవడం కష్టంగా ఉంది.
థాంక్స్, మారుస్తానండి. నాకు కంప్యుటర్ నాలెడ్జ్ అంతగా లేదండి.
ReplyDeleteha ha.. superb.. chala baga raasaru.. I like it...
ReplyDeletehahhahha..ilaantivichadivite enta relaxinga vuntudo! thanks!!
ReplyDeleteavunu kada. pata sinmaalalo heroin hero ni chustoone tyagam pata padutunna evarikee ardham kadu. people were very naive.
ReplyDelete