haaram logo

Sunday, September 27, 2009

" ఇంక ఈ బ్లాగ్ ఆపివేస్తున్నాను" ....

రమణారెడ్డి గారికి,

నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలుపెట్టిన నా బ్లాగ్ ని దసరా శుభాకాంక్షలతో ఆపివేయదలచుకున్నాను....

నేను కొత్తగా బ్లాగ్ ఓపెన్ చేద్దామనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరిని రకరకాల పేర్లు సూచించమని అడిగాను. వాటిల్లో మయూఖ, మనస్వి అన్న పేర్లు నాకు చాలా నచ్హాయి. ముందు ఓపెన్ చేసిన బ్లాగ్ కి మయూఖ అని పేరు పెట్టాను. కంప్యుటర్ లో కూడా ఆక్సెప్ట్ అయ్యింది. తరువాత మనస్వి ఓపెన్ చేసుకొని నా కిస్టమైన పాటల కోసం పెట్టుకున్నాను. ఇది కూడా ఆక్సెప్ట్ అయ్యింది. ముందుగా మీ మయూఖ ఉన్న సంగతి నాకు తెలియదు. ఇందులో నేను మిమ్మల్ని చూసి కాపీ కొట్టిందేమి లేదు. ఇది అనుకోకుండా జరిగి పోయింది.

కాని తెలిసిన తరువాత మార్చటానికి నా మనస్వి తోటి ప్రయోగాలు మొదలు పెట్టాను. కాని మొత్తం బ్లాగ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు మనస్వి లో ఏమి రావటం లేదు. కొత్త టెంప్లేట్ కూడా చూసుకున్నాను. నాకు నచ్హిన కొన్ని వేరే పేర్లతో బ్లాగ్ ఓపెన్ చేద్దామంటే అది రావటం లేదు. నెల రోజుల పైగా నేను దీనికోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నా మయూఖ లో ఉన్నవన్ని కొత్త దానిలోకి ఉన్నవి ఉన్నట్లుగా మార్చుకోవాలని నా ప్రయత్నం. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లుగా నేను రాసుకున్నవి అన్ని కామెంట్స్ తో సహా వేరే బ్లాగ్ లోకి మార్చుకోవాలని నా ప్రయత్నం. కాని ఇవన్నీ చేయాలి అంటే చాల సమయం పట్టే టట్లుంది. నేనేమి కంప్యూటర్ ఎక్ష్పర్ట్ ని కాదు. నాకు ఒకరి సహాయం కావాలి. ఒకసారి మారుస్తున్నాను కాబట్టి ఇంక పర్ఫెక్ట్ గా ఉంచాలి అనుకున్నాను. ఇటువంటివే ఇంకా కొన్ని ఇతర సమస్యలు ఉన్నాయి.

రెండు బ్లోగుల పేర్లు ఒకటే ఉన్నంత మాత్రాన పెద్ద ప్రమాదం ఉందని నేను అనుకోలేదు. బ్లోగ్ లో ప్రవేశించే వారికి ఇద్దరి పేర్లు వేరుగానే తెలుస్తాయి. మీరు రాసే విషయాలకి, నేను రాసే విషయాలకి చాలా తేడా ఉంది. వ్రాసే పద్ధతిలో కూడా చాల తేడా ఉంది. బ్లోగ్ లోకం గురించి నాకు అంతగా తెలియదు. ఇంతకంటే ఎక్కువ నేను ఆలోచించలేక పోయాను.

దొంగ పేర్ల తోటి వేరే బ్లోగర్స్ ని ఇబ్బంది పెట్టే అంత గొప్ప సంస్కారం కాదు నాది. నేను పెట్టుకున్న బ్లాగ్ పేరు మీకు అంత విపరీతంగా నష్టాన్ని కలిగిస్తుందని నాకు తెలియదు.

మీరు "కూడలి" ముఖంగా తెలియ చేసారు కాబట్టి నా నిర్ణయం కూడా బాధ్యతాయుతంగా "కూడలి" ముఖం గానేతెలియ చేయాలనుకున్నాను. ఇంక నా మూలంగా మీకు ఎటువంటి సమస్యా రాదు.

ఇంతవరకు నా బ్లాగ్ ని దర్శించి, తప్పులున్నప్పటికీ, అన్ని రకాలు గా ప్రోత్సహించిన బ్లాగ్ పెద్దలందరికి నా క్రుతజ్ఞతలు.

ధన్యవాదాలు.

25 comments:

  1. జయ మేడం, ఇంతలో బ్లాగును మూసివేయల్సిన అవసరమేమిటి? అలా తొందరపడి మూసి వేయకండి. మీరు పాత విషయాలు రాస్తున్నారు వాణి శ్రీ కాలం నాటివి. రమణా రెడ్డి రాసెవాటికి మీరు రాసె వాటికి చాలా వ్యత్యాసం ఉంది. మయుఖ కాకపోతె మయూరి అని పేరు పెట్టి రాస్తుండండి.

    ReplyDelete
  2. At last, some sense prvails!

    I think you totally missed the point when Ramana Reddy pointed out that it is not a great idea to start another blog with a name that he is already using.
    అదే పేరును పెట్టుకోవడంలో తప్పేమీ లేదని మీరు చేసిన వాదనలు మీకు బ్లాగ్లోకంపై అవగాహన బొత్తిగా లేదని నిరూపించాయి.

    ఈ లోకానికి కొత్త అని మీరే చెప్పుకున్నారు. అటువంటప్పుడు ఇక్కడ అడుగు పెట్టే ముందు ఇక్కడి etiquette గురించి కొంచెం తెలుసుకొనే ప్రయత్నం చెయ్యాలి. లేకపొతే ఇంకొకరు గుర్తు చేసిన తర్వాతైనా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోనుండాలి.

    You kept insisting that there is nothing wrong in what you were doing because your content was 'different' from what Reddy was writing.

    రెడ్డి గారు మీతొ సున్నితంగా చెప్పిన మాటలు మీరు అప్పుడే వినుంటే ఇప్పుడు మీరు రాసిన వివరణకు అవసరమే లేకపోయేది.

    ReplyDelete
  3. There are no particular rules or copyrights for the blog names ...as long as blogger accepts it you can use it.. it depends on mutual understanding.. i understand you did not know about this other mayukha when you opened .. but thats not your mistake. when someone 'who is already having that name' requests.. its your decision to give up or not.. If I was in your place I would give up if that is an active blog...


    Mu suggestion is ... We read any blog by content not by title.. cachy tiles are good for people who are firstime to koodali..but for regular reader's it jaya gaari blog..

    Also name of the blog represents the taste of the writer.. some names are really good ...

    come with other good name...Good Luck and expecting good posts from you..

    Don't stop wrting because of this small incident..

    ReplyDelete
  4. జయగారు,

    ముందుగా విజయదశమి శుభాకాంక్షలు..

    ఐనా ఇప్పుడేమైందని బ్లాగు మూసేస్తా అంటున్నారు.ఇక్కడ ఏ పేరుమీద ఎవరికి కాపీరైటు లేదు. చదివేవాళ్లకి కన్ఫ్యూజ్ కాకుండా మీ టైటిల్ కి ముందు చిన్న పదం చేర్చండి.అంతే..సాంకేతికసహాయం కావాలంటే ప్రమదావనం, బ్లాగుగుంపు ఉండనే ఉన్నాయి. లేదా నాకు మెయిల్ చేయండి . తప్పక చెప్తాను.

    ReplyDelete
  5. ఇందాకనే ఈ విషయం గురించి రమణారెడ్డిగారి మయూఖలో కామెంటాను. అది మీ బ్లాగ్గురించని ఊహించలేదప్పుడు. మీకెలాగా మనస్వి అని ఇంకో బ్లాగుంది కాబట్టి దీనిలోని టపాలు, వ్యాఖ్యలతో సహా దానిలోకి బదిలీ సులభంగా చేసుకోవచ్చు. బ్లాగు ప్రయాణం కొనసాగించండి.

    ReplyDelete
  6. నాకు ప్రస్తుతం "మయూఖ" మీద ఎటువంటి కోరిక లేదండి. వేరే బ్లాగ్ ఓపెన్ చేసుకొని, మళ్ళీ రాయటానికి ప్రయత్నిస్తాను. శ్రీకర్ గారు, pinstriped zebra గారు, మంచుపల్లకీ గారు, జ్యొతి గారు, కొత్తపాళీ గారు మీకు పేరు పేరునా నా క్రుతజ్ఞతలు. జ్యోతిగారు నేను తప్పకుండా మీ సహాయం తీసుకుంటాను. థాంక్యు.

    ReplyDelete
  7. జయగారు, మయూఖలోని టపాలు మరో బ్లాగులోకి , కామెంట్లతో సహా బదిలీ చేసుకోవచ్చు. లేదంటే మీ మనస్విలోకి మార్చొచ్చు. రాయటానికి ప్రయత్నిస్తాను కాదు.రాయాల్సిందే. మీ బ్లాగుకు మీరే మహారాణి. ఇలా బాధపడితే ఎలా??

    ReplyDelete
  8. జయగారూ, ఇప్పుడే చూశాను మీ టపా.. రమణా రెడ్డి గారి టపా ఇంకా చూడలేదు.. మీకు ఈ బ్లాగులో కంటెంట్ అంతా వేరే బ్లాగులోకి మార్చుకోడం కష్టం అనిపిస్తే, బ్లాగు పేరు మార్చండి చాలు.. ఇందుకోసం రాయడం మానేయనవసరం లేదు.. బ్లాగడం కొనసాగించండి..

    ReplyDelete
  9. I think somebody here has some identity crisis. when somebody is trying to enter a blog they would type the entire URL. say to enter Mrs. Jays's blog you type "http://jaya-mayookha.blogspot.com"

    I don't think there is a need to change the name of the blog or stop witing. I'd say jaya garu continue writing the blog and its perfectly alright to have the name you have today. if there was a problem blogpost administrators would have informed you about this.

    the very meaning of a "Blog" is freehand writing and openly writing what you feel. I totally disagree to the argument that you've need to change the name or stop writing.

    - This is my take on the subject -

    ReplyDelete
  10. Murali gaaru, Thankyou very much for your considaration. I am changing my blog and I restart soon from that new one.

    Mr. Ravi, Thankyou very much. Why should I trouble somebody. No Identity crisis. I don't mind to change my blog. Now I have changed and I start my reposting from tomarrow.

    ReplyDelete
  11. జయ గారు, పేరు మార్చుకోండి సరిపోతుండి మళ్ళీ కాంటెంట్ అంతా మార్చటం ఎందుకు... నేను మొదట్లో మనసులో మాట అని పెట్టేను తెలియక సుజాత గారు చెప్పేక అప్పుడు నాలిక కరుచుకుని పేరు మార్చేను క్రిష్ణ గీతం అని.. బ్లాగ్ ముయ్యటం ఎందుకు మన జ్యోతి గారున్నారు కదా సాయం కావాలంటే..

    ReplyDelete
  12. భావన గారు, థాంక్స్. జ్యొతి గారు హెల్ప్ చేసారు. 'మనస్వి ' గా మళ్ళీ ఒచ్హాను. చూడండి.

    ReplyDelete
  13. క్షమించాలి ఆలస్యంగా వచ్చాను. అయినా మీకు మీ కొత్త బ్లాగులో జయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. :)

    ReplyDelete
  14. విశ్వప్రేమికుడు గారు, మీకు ధన్యవాదాలు. ఎప్పుడో ఒక సారి కనిపించారు మీరు అంతే. నా ప్రొఫైల్ మార్చేసానన్నారు. నాకు బాగా గుర్తు. మళ్ళీ మీరెప్పుడొస్తారా అని చూస్తున్నాను.

    ReplyDelete
  15. మీ బ్లాగు బాగుందంది. చాల బాగ రాస్తున్నారు. చిన్న మార్పులు చెస్కుంటే బ్లాగు పేరులో సరిపొతుందేమొ కదా, అయినా మీ కొత్త బ్లాగు బాగుండాలని ఆశిస్తూ All The Best!

    ReplyDelete
  16. థాంక్యూ, ఆదిత్య గారు.

    ReplyDelete
  17. శివచెరువు గారు, థాంక్యూ. నా మనస్వి ని చూడండి. మీ అందరి ప్రోత్సాహంతో ఏవో తిప్పలు పడుతున్నానుగా! ఎలా ఉన్నాయో రాయండి.

    ReplyDelete
  18. mmm.........its not at all a prob ........no one has patent rights on names.......
    as jyothi said .........it may cause some confusion.........just add some word

    like

    mayookha-jaya


    dont think much........some bloggers dont know how to speak politely.........

    ReplyDelete
  19. modati sari mi blog visit chesi chusanueeroju. chala varaku anni posts cover chesanu. blog rayadam apesi tappu chesaremo anipistundi. malli rayandi. evaro analochintanga aninanduku maneste manalni manam compromise chesukunatte kada. karma siddantam ani okati untundani marosari gurtuchesukondi. :-)

    ReplyDelete
  20. Jaya,
    Let me say you one thing, name you selected is not the one some one's own,if the word is from dictonary then it is universal,next your subjects should not be same as some one who is already bloging or say barking,it is very unfortunate this gentel man took in wrong sense,no need to cease the blog and restart with new name after all it is your own concived daughter,if at all my daugter's name also happend to be same you mean to say either I change it or say kill her, please continue,no legal obligation.
    Rao

    ReplyDelete
  21. @జయ గారు
    సరే మీకు పేరు తోనే కదండి కష్టం పేరు మట్టుకు మార్చుకోవచ్చు బ్లాగ్ ని అలానే ఉంచేసి . settings -> basic కి వెళ్ళి బ్లాగ్ పేరు మార్చేసుకోండి. ఎప్పుడు విజ్ఞానానికి హక్కులు వుండవు అంది. ఎవరైనా పంచవచ్చు. ఎవరో ఏదో చెప్పారని అల ఆపేయడం కాదు. ఎండాకాలం సూర్యుడ్ని ఎంత మంది తిట్టుకుంటారో మరి ఆయన అలిగి దాక్కుంటాడా చెప్పండి. చలి మంచును నిప్పుతో తరిమి కొడితే అది మొత్తానికి వదిలిపోతుందా చెప్పండి. అలా జేరిగితే కనుక మీరు ఆపెయవచ్చును.

    ఆలోచనకి ఆవేదనకీ
    సంతోషానికి సంబరానికి
    కష్టాలకు నష్టాలకు
    హక్కులెవరివి?
    ఎవ్వరివి కాదు అది అనంతమైనది
    అందరికి చేరాల్సింది.

    మీరు కొనసాగించాలి అంతే . ఆయన ఒక్కరి కోసం అపుతనంటున్నారే. ఇంతమంది కోసం కొనసాగించాలి కదా మరి అడిగినప్పుడు.

    ReplyDelete
  22. కోటేశ్వర రావ్ గారు, కల్యాణ్ గారు ధన్యవాదాలండి.

    ReplyDelete
  23. saati blog peddaga nenu kooda chaala chintusthunna meeru blog apesinanduku meeru niryanni maarchukuntaarani aa bhagavanthudni praarthisthooooooo

    ReplyDelete