haaram logo

Tuesday, September 22, 2009

ఇది ' తృష్ణ ' కి



జీవితమనే కాగితం

కలం కాగితాన్ని తాకినా, కక్షతో మాత్రం కాదు
కమనీయంగా మార్చాలని ప్రయత్నం మాత్రమే
పొలంలో హలం పరుగిడుతుంది, హరించి వేయాలని కాదు
హర్షణీయమైన ఫలితం ఆశించి మాత్రమే
అలాగే
నీ జీవితమనే కాగితాన్ని కమనీయంగా మార్చాలని కొందరు
నీ జీవితమనే పొలం లో, చెత్తమొక్కలు తీయాలని ఇంకొందరు
ప్రయత్నిస్తు ఉంటారు
వారిని మాత్రం పదిలంగా
నీ మదిలో దాచుకో మిత్రమా!

****************

ఒకప్పుడు నాకోసం రాసుకున్న ఈ 'నేను ' ఇప్పుడు 'నీ ' కోసం

నేను .....

ఓ అద్భుతాన్ని ....
ఓ ఆనందాన్ని - ఓ ఆశ్చర్యాన్ని
ఓ అనుభూతిని - ఓ అనుభవాన్ని
అంతులేని అలోచనను

ఆలోచనల అద్వైతానికి ఆక్రుతినిచ్హే ప్రక్రుతిని
విభాత సంజలో విరబూసిన చంద్రకాంత పుష్పాన్ని
ప్రభాత తుషారంలో తడిసిన తెల్లతెల్లని గులాబీని
శ్రావణ మేఘాల మధ్య మెరిసె ఒంటరి నక్షత్రాన్ని

కార్తీక పున్నమి నాటి వెన్నెల తాగి
చంద్రున్ని చూసి గర్వంగా నవ్వే చకోరన్ని
చలించే కాలాన్ని-జలపాతాల పరుగుల్లో
విద్యుల్లతలు మెరిపించే జ్వలిత జ్వాలను
నేను ...నేనే....నాకు ... నేనే!

పూర్వాపరాలతో నిమిత్తం లేని అపూర్వాన్ని
అసూర్యంపశ్యను నేను
విశ్వాంతరాళంలో నేనో పాలపుంతను
చరాచర జగత్తుకు వైతాళిక గీతం పాడే వేగుచుక్కను
ఈ చీకటి నా కంటి కాటుక కాదా!
ఈ వెన్నెల నామేని నిగారింపు కాదా!
మలయ మారుతం నా మంజుల గానం
పారిజాత పరిమళాల పాట పాడు నా నిశ్వాసం
నాకు నేనే సర్వస్వం ...... సమస్తం

*******************************

12 comments:

  1. నీకోసమో ,తృష్ట్ణ గారి కోసమో ఎవరి కోసము రాసినా కవిత బాగా రాసావు.
    పిక్చర్ కూడా బాగుంది.
    మొత్తానికి ఇంటి పేరు నువ్వైనా నిలబెడుతున్నావు . గుడ్ .

    ReplyDelete
  2. no words...
    మీ అభిమానానికి కృతజ్ఞురాలిని...!!

    ReplyDelete
  3. కొత్త పాళీ గారు
    మురళి గారు
    మాలా గారు
    త్రుష్ణ గారు మీ అందరి ప్రతిస్పందనకి నా ధన్యవాదాలు
    అశ్విన్ గారు మీరు ఇచ్హిన 'గుర్తు ' ని నేను అర్ధం చేసుకోలేక పొయాను. బహుశ అది మంచి సింబల్ అయిఉంటుంది అని నా నమ్మకం. థాంక్యు.

    ReplyDelete
  4. "ఓ అద్భుతాన్ని ....
    ఓ ఆనందాన్ని - ఓ ఆశ్చర్యాన్ని
    ఓ అనుభూతిని - ఓ అనుభవాన్ని
    అంతులేని అలోచనను"

    very nice expressions!

    ReplyDelete
  5. ఉష గారు, ధన్యవాదాలు

    ReplyDelete
  6. Mee posts anni bavinnai... Specially your writing style is what I liked.

    -Ravi Komarraju

    ReplyDelete